Friday 5 October 2012

బీమునిపట్నం మండలం వివరాలు


భీమునిపట్నం

భీమునిపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. భారతదేశంలో రెండవ పురపాలక సంఘం (మునిసిపాలిటి) ఆంధ్ర ప్రదేశ్లోని మొదటి మునిసిపాలిటి(భారత దేశంలో మొట్టమొదటి మునిసిపాలిటి గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం) [1]. ఇప్పటికి కుడా మునిసిపాలిటీ కార్యాలయం పెంకులతో నిర్మించబడి ఉంటుంది.ప్రాంతీయులు గ్రామాన్ని భీమిలి అని పిలుస్తారు. భీమిలి విశాఖపట్టాణానికి 24 కి.మీ. దూరంలో విశాఖ-భీమిలి బీచ్ రోడ్డుపై చివరిన ఉన్నది.
భీముని పట్టణం పశ్చిమం వైపు ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపు సముద్రతీరానికి వచ్చేటప్పటికి పల్లం కావడం వల్ల భీమిలి పట్టణం పశ్చిమం నుండి తూర్పు వైపు సముద్రతీరం వైపు చూస్తే కనిపించే పకృతి దృశ్యం అత్యంత రమణీయంగా ఉంటుంది. పట్టణంలోని లాటిరైటు శిలలపై ప్రాచీనమైన నరసింహ స్వామి దేవాలయం ఉన్నది. ఇంకో విశేషం ఇక్కడ ఇప్పటికీ డచ్ వారి వలస స్థావర అవశేషాలు ఉన్నాయి. భీమిలి బీచ్ లోతు ఉండదు కాబట్టి ఈత కొట్టడం క్షేమదాయకం.

[మార్చు]చరిత్ర

బుద్ధుని అవశేషాలలోని ఎనిమిదవ భాగం భీమిలి సమీపంలోని తిమ్మాపురం బావికొండ బౌద్ధకేత్రంలో లభ్యమైందట.1641 సంవత్సరంలో హైదరాబాద్నవాబు కులీకుతుబ్షా నుండి అనుమతి పొందారు డచ్దేశస్థులు.1754లో జరిగిన మరాఠీ దాడుల్లోనూ, 1781 లో ఫ్రాన్స్‌, బ్రిటన్ మధ్య జరిగిన యుద్ధంలోనూ డచ్కోట పాక్షికంగా ధ్వంసమైంది. 1825 లో భీమిలి రేవు పట్టణం బ్రిటిష్వారి వశమైంది. 1854లో రిప్పన్కంపెనీని ప్రారంభించారు.

[మార్చు]భీమిలి ఆకర్షణలు


 [మార్చు]నరసింహ స్వామి దేవస్థానం

1226 శాలివాహన శకంలో  దేవస్థాన పునరుద్ధరణ మింది రామ రమజోగి చేత జరిగింది. తరువాత ముగుగప్ప శెట్టి, అలగప్ప శెట్టి స్వామి వారికి కాంస్య కవచాన్ని బహుకరించారు.

[మార్చు]భీమిలి కోట

16-18 శతాబ్ధాల మధ్య ఐరోపా ఖండం వారు భారతదేశానికి వర్తకం చేసుకోవడానికి వచ్చిన భాగంగా భీమిలిలో డచ్ వారు దిగారు. 1624 డచ్ వారు ఇక్కడ మొదట వలస వచ్చినప్పుడు ప్రాంతీయులకు డచ్ వారికి మధ్య ఘర్షణలు జరిగాయి. ఘర్షణలలో 101 మంది డచ్ సైనికులు 200 మంది ప్రాంతీయులు మరణించారు(విశాఖ శాసనాల వల్ల తెలుస్తోంది). తరువాత ప్రాంతీయులకు డచ్ వారికి సంధి కుదిరి వర్తకం చేసుకోవడానికి 1661లో 4 కొమంలతొ ఒక కోట 234*400 వైశాల్యంతో నిర్మించుకొన్నారు. కోట ఇప్పుడు శిధిలమై పోయి అవశేషాలు మిగిలాయి. కోటలో గడియార స్థంబం, టంకశాల ఉన్నాయి.

[మార్చు]గడియార స్థంబం

పట్టణ మధ్యలో ఉన్న గడియార స్థంబాన్ని ప్రతి పర్యాటకుడు దర్శించి తీరాలి.
భీమిలి సాగరతీరం.

[మార్చు]సెయింట్ పీటర్ చర్చి

1855-1864 సంవత్సరాల మధ్య చర్చి నిర్మాణం రాయి రెవరెండు జాన్ గ్రిఫిన్స్ ద్వారా అప్పటి జిల్లా కలక్టరు మరియు జిల్లా మెజిస్ట్రేటు రాబర్ట్ రీడ్ ఆధ్వర్యంలో జరిగింది. తరువాత 17-3-1864 భిషప్ గెల్ చేత చర్చి తెరువబడింది. చర్చి నిర్మాణ శైలి, లోపలి వస్తువులు, తూర్పు కిటికి మీదఏసుక్రీస్తుని శిలువ వేస్తున్న సంఘటను చిత్రించిన విధానం చాల విశేషంగా ఉంటుంది. చర్చిలో ఎంతో కాలం ముందు నిర్మించిన పాలరాతి శిల్పాలు నేత్రానందాన్ని అందిస్తాయి.

[మార్చు]పాత డచ్ శ్మశానవాటిక

పట్టణానికి పశ్చిమంగా నిర్మించబడిన శ్మశానవాటిక డచ్ వారి పట్టణంలో నివసించారని చెప్పడానికి, వారి జీవితం ఇక్కడే పూర్తి చేసారని చెప్పడానికి ఋజువు. స్మశానంలో వారిని ఖననం చేసిన ప్రదేశంలో వారి మరణానికి కారణాలను తెలుపుతూ రాతి ఫలకాలు ఉన్నాయి.

[మార్చు]సముద్ర తీర అతిథి గృహము

అతిధి గృహం చిట్టివలస జూట్ కర్మాగారం ఆధీనంలో ఉన్నది. పూర్వం అతిథి గృహంలో ఇంపీరియల్ బ్యాంకు ఉండేది. తరువాత గృహాన్ని చిట్టివలస ఝూట్ మిల్లు వారు దత్తత తీసుకొని గృహం చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు. పట్టణ వైభవాన్ని చెప్పడానికి అతిథి గృహం ఒక తార్కాణం. భీమిలి దర్శించడానికి వచ్చిన ప్రతి సందర్శకుడు అతిధి గృహాని చూసి తీరవలసిందే.

[మార్చు]మునిసిపాలిటి సత్రం

మునిసిపాలిటి సత్రం రెండు రాళపై మద్రాసు పెంకులతొ కట్టబడింది.

[మార్చు]మునిసిపాలిటి మరియు షిప్పింగ్ కార్యాలయం

పురపాలక సంఘ కార్యలయము మరియు నౌకాశ్రయ రవాణా కార్యాలయం; ఒకే సముదాయములో ఉన్న రెండు భవనాలు ఇక్కడి నౌకాశ్రయము యొక్క ఎగుమతులు మరియు దిగుమతుల పూర్వవైభవాన్ని గుర్తు చేస్తాయి. విశాల భవనాలలో ఎత్తైన పైకప్పుతో ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

[మార్చు]భీమిలీ దీప స్థంభం

కాకినాడకు శ్రీకాకుళానికి మధ్య నిర్మించబడిన ఎనిమిది దీప స్తంభాలలొ (లైటు హౌసు) ఇది ఒకటి. దీప స్తంభం 18 శతాబ్దపు భీమిలి నౌకాశ్రయ వైభవాన్ని తెలుపుతుంది.

[మార్చు]భీమేశ్వరాలయం

పట్టణ ముఖ్య రహదారి పై ఉన్న దేవాలయ సముదాయం లొ ఉన్న ప్రాచీన దేవాలయం 1170 శాలివాహన శకం లొ ఆలయ నిర్మాయం జరిగింది. దీనికి అనిదంధంగా చోళేశ్వరాలయం చోళులచేనిర్మంచబడింది.

[మార్చు]చేరుకొను విధానం

భీమిలీ నుండి విశాఖ కు తరచు ఆర్.టి.సి. సిటి బస్సులు 999 మరియు 900k నడుస్తుంటాయి. 24 కి.మి పొడవున్న బీచ్ రోడ్డు భారతదేశం లొని పెద్ద బీచ్ రోడ్డులలొ ఒకటిగా చెబుతారు.ద్విచక్రవాహనాల పైన కూడా విశాఖ నుండీ భీమిలి కి చేరు కొవచ్చు. విశాఖ నుండి తరచు అద్దె కారులు అందుబాటులోవుంటాయి.

[మార్చు]మండలంలోని పట్టణాలు

§                    భీమునిపట్నం (m+og)
§                    భీమునిపట్నం (m)
§                    తగరపువలస

[మార్చు]మండలంలోని గ్రామాలు

§                    అమనం

No comments:

Post a Comment